Skip to content

స్వచ్ఛ భారత్

02/10/2015

సుమారు 15 సంవత్సరాల క్రితం నా మిత్రునితో బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. కొన్ని గ్రామాల్లో మహిళలు రోడ్ల పక్కనే బహిరంగ మలవిసర్జన కోసం బస్సు వెళ్ళిపోవడానికి వేచి చూస్తూ నిలబడి ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధ కలిగింది. అప్పుడు నా మిత్రునితో ఇలా అన్నాను. “మనం స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళు పూర్తయ్యిన వేడుకలు చేసుకుంటున్నాము కాని, ఇప్పటికీ మహిళలకి కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నాము. ఇలాంటి మహిళల పరిస్థితిని చూసి మన దేశాన్ని పాలిస్తున్న ప్రధానమంత్రి సిగ్గుతో చచ్చిపోవాలి.” దానికి నా మిత్రుడు “ఇలాంటి విషయాలకి ప్రధానమంత్రి ఏమి చెయ్యగలడు? ప్రజలకి కామన్ సెన్స్ ఉండాలి కాని” అని అన్నాడు. ప్రజలకి కామన్ సెన్స్ ఎందుకు ఉండదు? గత్యంతరం లేకే ఇలా రోడ్డు పక్కకి వస్తున్నారని నేను వాదించాను.

కాని ఇన్నేళ్ళ తరువాత ఒక ప్రధానమంత్రి నిజంగానే ఈ సమస్యకి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. గత సంవత్సరం ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి ప్రధాని నరేంద్ర మోది ఈ విషయం ప్రస్తావించడం, తరువాత అక్టోబర్ 2 గాంధి జయంతి సందర్భంగా స్వచ్ఛ్ భారత్ మిషన్ ప్రారంభించడం మంచి పరిణామాలు.

ప్రజలందరికీ ఇళ్ళలో, విద్యార్థులందరికీ పాఠశాలలలో మరుగుదొడ్డి సౌకర్యం కల్పించడం, యావత్ భారతదేశం 2019 కల్లా పరిశుభ్రంగా చేసే లక్ష్యాలు గల ఈ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం మన దేశానికి ఎంతో అవసరం. అయితే గత ఏడాదిగా జరుగుతున్న కార్యక్రమాలు పరిశీలిస్తే 2019 నాటికి అనుకున్న లక్ష్యాలు సాధించేలా కనపడడంలేదు. సెలెబ్రిటీల హడావిడి, ఫొటో సెషన్లే ఎక్కువగా జరిగాయి. తెలుగు రాష్ట్రాలలో ఇటీవల పారిశుధ్య కార్మికులు సమ్మె చేసినపుడు ఈ సెలబ్రిటీలు, బ్రాండ్ అంబాసిడర్లు ఏమయ్యారో తెలియదు. కాని కొన్ని చోట్ల యువకులు మంచి పనులు చేసి చూపించారు.

ఇప్పుడు ఆరోగ్యం కోసం అన్ని వయసులవారూ, ఉదయాన్నే జాగింగ్ చెయ్యడమో, జిమ్‌లో వ్యాయామాలు చెయ్యడమో చేస్తున్నారు. ఈ సమయాన్ని స్వచ్ఛ్ భారత్ కోసం ఉపయోగిస్తే ఈ మిషన్ విజయవంతం అవుతుంది. డంబెల్స్ పట్టుకునే చేతులు చీపురు పట్టుకోవాలి. ఇందువలన జిమ్‌లో వ్యాయామాల కోసం డబ్బు ఖర్చు చెయ్యాల్సిన పని ఉండదు. పైగా దేశానికి సేవ చేసినవారవుతారు. ఇలాంటి పనులని ఒక్కొక్కరూ విడిగా చెయ్యలేరు కాబట్టి, అపార్ట్‌మెంట్ లేదా కాలనీవాసులంతా కలిసి బృందంగా పని చెయ్యాలి. గాంధీజి ఆచరించిన సిద్ధాంతాలని మనం కొంతైనా పాటించాలి కదా. ఇలా కనీసం మన సమీప పరిసరాలు శుభ్రం చేసుకోగలిగినా మనకి అపరిశుభ్రత వల్లె వచ్చే రోగాలు రాకుండా ఆరోగ్యం బాగుంటుంది.

WHY TO PAY FOR THE GYM

అలాగే ఇంతటి బృహత్తర యజ్ఞం మానవమాత్రులవల్ల సాధ్యం కాదు. అంటే మనం కేవలం చేతులు, చీపుర్లతో ఈ మిషన్ పూర్తిచెయ్యలేము. ఈ కార్యక్రమంలో వీలైనంత ఆటోమేషన్ తీసుకురాగలిగితేనే లక్ష్యం సాధించగలం. నగరాల్లో కొండల్లా పేరుకుపోతున్న చెత్తను ఏ రోజుకారోజు తొలగించడం ఇప్పుడున్న కార్మికులవల్ల కాదు. యంత్రాలే ఆ పని చెయ్యాలి. అలాగే మురుగు కాలవల్లో, రైల్వే ట్రాకులపై కార్మికుల చేత పారిశుధ్య పనిచేయించడం అమానుషం. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో పనిచెయ్యడానికి కావలసిన యంత్రాలు తయారు చెయ్యాలి. అవసరమైతే శాస్త్రవేత్తలతో, సైన్సు, ఇంజనీరింగ్ విద్యార్థులతో కొత్త కొత్త యంత్రాలు సృష్టించాలి.

ఈ స్వచ్ఛ్ భారత్ పథకానికి కావలసిన వేల కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకోవడానికి పెట్రోల్, డీజిల్, ఖనిజాలు మొదలైనవాటిపై అదనపు సుంకం విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పెట్రోల్, డిజిల్ లాంటి ముఖ్యావసరాలపై పన్నులు పెంచడం కంటే, మొబైల్ ఫోన్ సేవలపై అదనపు పన్ను విధించడం మంచిదని నా అభిప్రాయం. ఇంచుమించు అన్ని ఫోన్ కంపెనీలు రకరకాల స్కీములు, ప్లాన్లతో టాక్ టైం, SMS ల చార్జీలు బాగా తగ్గించారు. దీనివలన ప్రజలకు మేలు ఏమీ జరగడంలేదు. రేట్లు తక్కువ అవడం వలన ప్రజలు ముఖ్యంగా యువత, వాళ్ళ సమయాన్ని అనవసర విషయాలు మాట్లాడుతూ వృధా చేసుకుంటున్నారు. రోడ్లపై నడుస్తూ, వాహనాలు నడుపుతూ కూడ ఫోన్లలో మాట్లాడుతూ ప్రమాదాలకి కారణమవుతున్నారు. ఫోన్ల వినియోగం పెరగడంతో కాల్ డ్రాప్స్ కూడ పెరుగుతున్నాయి. ఇందుకు పరిష్కారంగా మరిన్ని సెల్ టవర్లు నిర్మించాలని కంపెనీలు యోచిస్తున్నాయి. దీనివలన రేడియేషన్ పెరుగుతుంది. ఇందుకు పరిష్కారంగా ప్రతీ ఫోన్ కాల్‌పై, SMS పై ఒక రూపాయి అదనపు పన్ను విధించినా, ప్రభుత్వానికి వేలకోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. ప్రజల అలవాట్లు బాగుపడి సమయం ఆదా అవుతుంది. ఫోన్ కాలుష్యం తగ్గుతుంది. స్వచ్ఛ్ భారత్ సాకారమవుతుంది.

మన భారతం స్వచ్ఛ భారతమైతే అనేక రకాల రోగాలు తగ్గి ఆరోగ్యంపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. అన్ని విధాలుగా ప్రయత్నించి స్వచ్ఛ భారత్ లక్ష్యం సాధిస్తే, అది 150వ జయంతి సందర్భంగా గాంధీజికి ఘన నివాళి అవడంతో పాటు ప్రపంచంలో మన దేశానికున్న అపఖ్యాతి కూడ తొలగిపోతుంది.

ప్రకటనలు
2 వ్యాఖ్యలు leave one →
  1. 04/10/2015 23:10

    good idea, sir!

  2. Ajay permalink
    05/11/2015 13:30

    Small correction, if it is one!!! prev govt started the private toilet initiation i guess. And vidyabalan acted in the TV ad’s.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: