విషయానికి వెళ్ళండి

పెద్దల ఆత్మహత్యలు – పిల్లల హత్యలు

05/11/2015

ఈ మధ్య ఏ రోజు ఉదయాన్నే వార్తలు చూసినా, చదివినా, రోడ్డు ప్రమాదాలతోపాటు ఆత్మహత్యలు కూడ ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ ఆత్మహత్యలు కూడ ఏదో ఒక వ్యక్తికి సంబందించినవి మాత్రమే కాకుండా మొత్తం కుటుంబం బలవన్మరణం చెందినట్టుగా ఉంటున్నాయి. అయితే ఇందులో పెద్దలవి మాత్రమే ఆత్మహత్యలు కాని, వాళ్ళ పిల్లలవి మాత్రం హత్యలే అని చెప్పక తప్పదు. పసిపిల్లల నుంచి టీనేజ్ పిల్లల వరకు, ఎవరికీ ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనే ఆ వయసులో ఉండదు. సాధారణంగా పిల్లలకి ప్రత్యేకంగా జీవన్మరణ సమస్యలు అంటూ ఏమీ ఉండవు. తల్లిదండ్రులు తమ సమస్యలు ఇక ఎట్టి పరిస్తితుల్లోనూ తీరవని భావించినప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తమ తరువాత పిల్లలకి బతకడం సమస్య కాకూడదని వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ముందే పిల్లలని హత్య చేస్తున్నారు.

తల్లిదండ్రుల జీవన్మరణ సమస్యలకు చాలావరకు ఆర్ధిక ఇబ్బందులే కారణం. కొంతమందికి ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అయితే, కొంతమందికి సరిపోయే ఆదాయం ఉన్నా, ఇంకా సంపాదించాలన్న అత్యాశ, విలాసాలు మొదలైనవి కారణాలు. వ్యాపారంలో, వ్యవసాయంలో నష్టాలు కూడ చాలాసార్లు కుటుంబం మొత్తాన్ని బలిగొంటున్నాయి. బంధుమిత్రులతో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు కూడ కొందరి విషయంలో కారణాలవుతున్నాయి.

అయితే పెద్దవాళ్ళ సమస్యలకి వాళ్ళ పిల్లలు ఎందుకు బలి కావాలి? తల్లిదండ్రులు సమాజంపై ఎంత విరక్తి చెందితే, తమ పిల్లలని తామే చంపుకుంటారు? తాము లేకుండా తమ పిల్లల జీవితానికి భరోసా లేదనుకున్నపుడే కదా మనసు చంపుకుని ఇంతకు తెగిస్తారు. అసలు తల్లిదండ్రులు లేని పిల్లలు స్వతంత్రంగా జీవించే అవకాశం మన సమాజంలో లేదా? వాళ్ళ ఒంటరి జీవితానికి భద్రత లేదా? దగ్గరి బంధువులు, సన్నిహితులు కూడ వాళ్ళని చేరదియ్యరా? ప్రభుత్వం ఇలాంటి పిల్లలకి ఏమి సహాయం చేస్తోంది? ఇలాంటి పిల్లలకి అవసరమైన శరణాలయాలు లేవా? ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరికినప్పుడు తల్లిదండ్రులు తమ జీవితాలతోపాటు పిల్లల జీవితాలని నాశనం చెయ్యరు.

గతంలో తమిళనాడు రాష్ట్రంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువులని వద్దనుకుని కొంతమంది వీధుల్లో వదిలేసేవారు. అలాంటి శిశువులని సంరక్షించడానికి అక్కడి ప్రభుత్వం ఉయ్యాల పథకం లాంటిది ఒకటి ప్రవేశపెట్టినట్టు గుర్తు. అదే విధంగా తల్లిదండ్రులు లేకపోయినా పిల్లల జీవితానికి భరోసా కల్పించే విధానం ప్రభుత్వం అమలుపరచగలిగితేనే, ఈ శిశు హత్యలు ఆగుతాయి. ప్రభుత్వం, సేవా సంస్థలు  వీళ్ళకి అవసరమైన శరణాలయాలు నడపాలి. పిల్లలు లేని వాళ్ళు వీళ్ళని దత్తత తీసుకోవాలి. అన్నింటికంటే ముందు సమాజం వీళ్ళని సరిగా ఆదరించగలగాలి. చేతనైన సహకారం అందివ్వాలి.

One Comment leave one →
  1. B Rama Rao permalink
    17/08/2016 19:44

    No one has right to kill or die as birth is not in their hand.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: