విషయానికి వెళ్ళండి

భరత్ అనే “లీడర్”

25/04/2018

ఈ మధ్య మహేష్‌బాబు సినిమాలు చూడడానికి ముందు సినిమా ఎలా ఉందో తెలుసుకుని మరీ వెళ్ళాల్సివస్తోంది. “భరత్ అనే నేను” సినిమాకి ఇంచుమించు అన్ని వెబ్‌సైట్లలో మంచి రేటింగ్ ఇచ్చి మహేష్ అద్భుతంగా చేసాడని వ్రాసారని, ఈ సినిమా మొన్న ఆదివారం చూసాము. కాని ఈ సినిమా ఇంతకు ముందు చూసిన “లీడర్” సినిమా లానే ఉంది. ఇకముందు మీడియాలో వచ్చే రివ్యూలు చదవకుండా పబ్లిక్ టాక్ ని బట్టి వెళ్ళాలి. అంత ఇదిగా రివ్యూలు వ్రాస్తున్నారు.

ఇంతకీ ఈ సినిమాకి “భరత్ అనే లీడర్” అని టైటిల్ పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే గతంలో వచ్చిన “లీడర్” సినిమాని అంతగా అనుకరించేసారు. పాపం శేఖర్ కమ్ముల! ఎందుకనో గమ్మునున్నాడు. ఒక ముఖ్యమంత్రి చనిపోతే విదేశంలో ఉన్న అతని కొడుకుని తీసుకువచ్చి ముఖ్యమంత్రిని చెయ్యటం, అతను ఇక్కడి నాయకులతో పోరాడి వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం అన్నదే రెండు సినిమాలలోనూ ఉన్న ప్రధాన కథ. ఇంచుమించు “లీడర్” సినిమాలోని పాత్రలే ఇందులో కూడ ఉన్నాయి. సుమన్ పాత్రలో శరత్ కుమార్, కోట పాత్రలో ప్రకాష్‌రాజ్, సుహాసిని పాత్రలో సితార, హర్షవర్ధన్ పాత్రలో బ్రహ్మాజి ఇలా ఆఖరికి గొల్లపూడి పాత్రలో దేవదాస్ కనకాల వరకు చాలా అనుకరించారు.

ఇంకా కొన్ని సీన్లు అంతకంటే ముందు వచ్చిన శంకర్ సినిమా “ఒకే ఒక్కడు” నుంచి తీసుకున్నారు. కాని కథ విషయానికి వస్తే ఆ రెండు సినిమాలే ఈ సినిమా కన్నా నయం. ఒకేఒక్కడు, లీడర్ సినిమాలలో హీరో పాత్రలకి ఒక లక్ష్యం, దాని పట్ల నిబద్ధత, నిజాయితీ ఉంటాయి. ఈ సినిమాలో హీరోకి మాత్రం వినోదమే లక్ష్యం. అతను చూపించే పరిష్కారాలు కూడ సినిమాటిక్ గానే ఉంటాయి కాని లాజికల్‌గా, ప్రాక్టికల్‌గా ఉండవు. అలాగే ఈ సినిమాలో కొన్ని తప్పులు కూడ ఉన్నాయి. ఉదాహరణకి సినిమా 2014కి ముందు జరిగిందని చెప్పారు. కాని కొన్ని టివి స్క్రోలింగులలో ఇప్పటి వార్తలు కనపడతాయి.

అయినా ఈ సినిమా ఇంతగా హిట్టవ్వడానికి కారణం ఏమిటంటే ఒక మామూలు కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన మాస్ ఫార్ములాలన్నీ చక్కగా ఉన్నాయి. సంగీతం, పాటలు, డైలాగ్స్ బాగున్నాయి. కొన్ని సన్నివేశాలు బాగా తీసారు. మహేష్‌బాబుని చాలా స్టైలిష్‌గా చూపించారు. పూర్తిగా వినోదభరితంగా ఉంది. కాని వచ్చిన సమస్య ఏమిటంటే ఇలాంటి ఫార్ములాలు అన్నీ సినిమాలో ఉండాలనుకున్నప్పుడు హీరో మరీ ముఖ్యమంత్రిగా కాకుండా ఒక MLA గానో, మంత్రిగానో, పోలీస్ గానో, కలక్టర్‌గానో, మరో వృత్తిలోనో ఉండి ఉంటే బాగుంటుంది. మసాలా సరిగ్గా సమకూరినప్పుడు అది వంకాయ కూర అయితే ఏమిటి? దొండకాయ కూర అయితే ఏమిటి? ఎంత యువకుడయినా ఒక  ముఖ్యమంత్రి రొమాన్స్, ఫైట్లు చెయ్యడం బాగోలేదు. గత రెండు సినిమాలలో కూడ ఇవి ఉన్నా, అవి కాస్తో కూస్తో సందర్భోచితంగా ఉన్నాయి. ఆ మధ్య హిందీలో అమీర్‌ఖాన్ కూడ ఇలాగే OMG (తెలుగులో గోపాల, గోపాల) సినిమా కథకి కొంత నేపధ్యం మార్చి, ఇంచుమించు అవే సన్నివేశాలతో PK సినిమా తీసి పెద్ద హిట్టు కొట్టాడు. (ఆ సినిమా గురించి ఇక్కడ చదవండి) కాని దాని ద్వారా ప్రేక్షకులకు కొత్తగా చెప్పేది ఏముంది?  

గతంలో హీరో కృష్ణ నటించిన “ఈనాడు” (1982) సినిమాలో హీరోయిన్ కూడ ఉండదు. ఆ సినిమాలో హీరో సొంత బావ అయిన మంత్రితో నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడతాడు. ప్రజలు, వ్యవస్థలకు సంబంధించి సినిమా తీయాలనుకున్నప్పుడు, వీలైనంత వరకు ఫార్ములాకు దూరంగా ఉంటే బాగుంటుంది. ఇదే కొరటాల శివ దర్శకత్వం వహించిన “జనతా గారేజ్” సినిమాలో తన ఆశయం కోసం హీరో తన ప్రేమని కూడ వదులుకుంటాడు. అప్పుడే హీరో వ్యక్తిత్వం నిలబడేది. ఈ దర్శకుడే తీసిన “శ్రీమంతుడు” సినిమాలో కూడ హీరో తన ఊరు గురించి తెలుసుకుని, ఆ ఊరి సమస్యలని పరిష్కరిస్తాడు. అయితే ఆ సినిమా కథ కూడ చాల వరకు 1984లో K. విశ్వనాథ్ తీసిన “జననీ జన్మభూమి” సినిమా కథలాగే ఉంటుంది. శివ గారు, సందేశం ఇవ్వాలనుకున్నప్పుడు దానికి కొంత సుగర్ కోటింగ్ అవసరమే, కాని మసాలా ఎక్కువైతే ఎబ్బెట్టుగా ఉంటుంది.

 

ప్రకటనలు
One Comment leave one →
  1. నీహారిక permalink
    25/04/2018 08:53

    సెకండ్ హాఫ్ లో నిద్రపోయాను.అంత బోర్ కొట్టిందీ సినిమా…ప్రతి సీన్ చూసినట్లే అనిపించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: