విషయానికి వెళ్ళండి

పోలవరం ప్రాజెక్టుని రాష్ట్రప్రభుత్వమే కట్టాలా?

06/05/2018

అనగనగా ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను తన కుటుంబంతో తన సొంత ఇంటిలో ఉంటున్నాడు. ప్రభుత్వం అతను ఉంటున్న రోడ్డు వెడల్పు చెయ్యాలనుకుంది. ఆ రోడ్డు వైడనింగ్‌లో అతని ఇల్లు పూర్తిగా కొట్టేసారు. ప్రభుత్వం అతనికి పరిహారంగా వేరొక చోట స్థలం ఇచ్చింది. అలాగే ప్రభుత్వ ఖర్చుతో అతనికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వానికి ఇతనికి ఇల్లు కట్టి పెట్టడంతో పాటు ఇంకా ఎన్నో ముఖ్యమైన పనులు ఉంటాయి కాబట్టి ఆ ఇల్లు కట్టడం ఆలస్యం అయ్యింది. అప్పటికి అతను అద్దె ఇంటిలో కాలక్షేపం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఇలా కాదని, తన ఇల్లు తానే కట్టుకుంటానని, ప్రభుత్వం ఇంటి నిర్మాణ ఖర్చు అంచనా ప్రకారం డబ్బు ఇప్పిస్తే చాలని అర్జీ పెట్టుకున్నాడు. మొత్తానికి ఆ ప్రతిపాదనకి ప్రభుత్వం ఒప్పుకుంది. వెంటనే అతను నిర్మాణ పని మొదలుపెట్టాడు. ప్రభుత్వం డబ్బు కొంత ఆలస్యంగా ఇచ్చినా, అప్పు తెచ్చో, భార్య నగలు అమ్మో తన ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు అతను తన స్వంత ఇంటిలో కుటుంబ సభ్యులతో హాయిగా ఉంటున్నాడు.

ఇప్పుడు చెప్పండి. ఆ వ్యక్తి ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మంచి డీల్ కాదని ఎవరైనా అనగలరా? ఆ ఇల్లు అతనికి చాలా అవసరం. ఇంకా చెప్పాలంటే అతని జీవన్మరణ సమస్య. ప్రభుత్వం తనకి ఉన్న మిగతా పనులతోపాటు తీరికగా అతని ఇల్లు ఎన్నో యేళ్ళ తరువాత నిర్మించి ఇస్తే అతని పరిస్థితి ఏమిటి? కొన్నాళ్ళకి ప్రభుత్వమో, విధానాలో, నిబంధనలో మారిపోతే అతనికి న్యాయం జరుగుతుందా?

మన రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు కూడ అంతే! కేంద్రప్రభుత్వం ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ మంచి పని చేసింది. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దానిని కేంద్రమే నిర్మించాలని నిర్ణయించారు. కాని ఆ ప్రాజెక్టు అవసరం కేంద్రానికంటే రాష్ట్రానికే ఎక్కువ. ఎన్నో దశాబ్దాలు జాప్యమయిన ఆ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది. ఆ అవకాశం వదులుకుంటే మళ్ళీ వస్తుందో, రాదో తెలియదు. ఇప్పుడు కేంద్రం వెంటనే బిల్లులు చెల్లించకపోయినా, రాష్ట్రప్రభుత్వం సొంత డబ్బుతోనో, అప్పు తెచ్చో నిర్మాణం పూర్తి చేసుకుంటే ప్రాజెక్టు వలన వచ్చే ఫలితాలు, లాభాలు త్వరగా మనం పొందగలము. కేంద్రప్రభుత్వం ఇవ్వాళ కాకపోయినా, రేపైనా ఖర్చు పెట్టిన డబ్బు ఇస్తుంది. కాని గడిచిపోయిన కాలం తిరిగి రాదు. ఇప్పుడు కనుక మనం పోలవరం పూర్తి చేసుకోలేకపోతే భవిష్యత్తు తరాలు మనలని క్షమించవు.

కేంద్రప్రభుత్వం విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి విద్యా సంస్థలు, ఇతర సంస్థలు మంజూరు చేసింది. కొన్ని సంస్థలు తాత్కాలిక భవనాలలో, ఇతర సంస్థల ఆవరణలలో పని చేస్తున్నాయి. కొన్ని సంస్థలకి శంఖుస్థాపన జరిగినా నిర్మాణం ఇంకా మొదలు అవ్వలేదు. కొన్నింటి నిర్మాణం మందకొడిగా సాగుతోంది. చాలా సంస్థలకి ఇంతవరకు నిధులే సరిగా కేటాయించలేదు. ఆ సంస్థల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో ఎవరూ చెప్పలేరు. దుగ్గరాజుపట్నం పోర్టు, కడప ఉక్కు ఫాక్టరీ లాంటివి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి. అలాంటప్పుడు మన రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుని కూడ కేంద్రానికి అప్పగించేసి చేతులు కడిగేసుకోవాలా? అలా చేస్తే ఆ ప్రాజెక్టు కొన్ని దశాబ్దాలైనా పూర్తవదు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రాజెక్టుని నిర్మిస్తోంది కాబట్టే ఈ మాత్రం పురోగతి అయినా కనిపిస్తోంది. లేకపోతే మిగతా హామీల లాగే పోలవరం కూడ కలవరం అయ్యేది.

ఇక చాలామంది చేస్తున్న ఆరోపణ ఏమిటంటే, రాష్ట్రప్రభుత్వం లంచాల కోసమే ఈ ప్రాజెక్టుని తన చేతులలోకి తీసుకుంది అని. అసలు మనదేశంలో అవినీతి లేనిది ఎక్కడ? గత కాంగ్రెసు ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు ధనయజ్ఞం కోసమే అని అందరికీ తెలుసు. సులభంగా చేసేయగలిగిన కాలువలు మాత్రం తవ్వి, అసలయిన నిర్మాణాలు (structures) చెయ్యకుండా ప్రాజెక్టులు మధ్యలో వదిలేసారు. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అడిగి చూడండి, గతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి కథలు కథలుగా చెప్తారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని విమర్శలు చెయ్యడాన్ని అర్థం చేసుకోవచ్చు కాని, ప్రజలు కూడ పని లేక పస లేని మాటలు మాట్లాడడం బాగోదు. పోలవరం మన రాష్ట్రానికి వరం. అర్థం చేసుకోండి, అడ్డు పడకండి. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి.

 

ప్రకటనలు
14 వ్యాఖ్యలు leave one →
 1. 06/05/2018 18:48

  మీ వ్యాసం బాగుంది. కానీ కేంద్రానికి సహాయం చేయాలన్న చిత్తశుద్ధి శూన్యం. అప్పుడేదో ఎలక్షనలలో గెవవటానికి నోటిమాటలు చెప్పినా అవి నీటిమూటలు అని తేలింది. మొదటి బడ్జట్ చూడండి పోలవరానికి వందకోట్లు ఘనంగా ప్రకటించారు.

  ఇల్లుకట్టించేదుకు అయ్యే ఖర్చంతా మాదీ పూచీ అని చెప్పి. మొదటి విడతగా ఒక వందనోటు విసిరితే దానిని సహాయం చేయటం అంటారా? వెక్కిరించటం అంటారా? నాలుగేళ్ళలో పూర్తిచేదాం అని వేలకోట్ల ఖర్చులో మొదటేడాది వందకోట్లివ్వటం హేళనచేయటమే కాదా?

  ఈ బీజేపీ కేంద్రప్రభుత్వానికి అబధ్ధాలాడటం తప్ప వేరే గొప్ప పనేమీ లేదని తెలుస్తూనే ఉంది అందరికీ.

 2. Anon permalink
  07/05/2018 00:03

  అబ్బ చా. ఏంటి బ్రదర్. పచ్చ మీడియా వాదన బలే చెబుతున్నావే.

 3. 07/05/2018 12:55

  @అజ్ఞాత: నాకు ఏ మీడియాతోను సంబంధంలేదు బ్రదర్! నా పోష్టులో తప్పు ఉంటే చెప్పు.

 4. 07/05/2018 12:58

  @ శ్యామలరావు: బిజెపికి చిత్తశుద్ధి శూన్యం అన్నది కరక్టే. అయినా మన రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టు కాబట్టి, మనమే ఎలాగో కష్టపడి నిర్మించుకోవాలి.

 5. నీహారిక permalink
  07/05/2018 14:08

  పోలవరం కంటే కాళేశ్వరం ప్రాజెక్టు సూపర్ ఫాస్ట్ గా పూర్తవడానికి కారణం ఏవిటంటారు?

 6. 07/05/2018 14:23

  ఏముంది, వాళ్ళు కేంద్రప్రభుత్వంపై ఆధారపడకుండా సొంత డబ్బులతో కట్టుకుంటున్నారు. Rich state.

 7. 07/05/2018 15:00

  పోలవరం ప్రాజెక్ట్ అవసరమా కాదా అన్న ప్రశ్న ప్రస్తుతానికి వదిలేస్తాను.

  నిర్మాణ బాధ్యత మాకే ఇవ్వాలి ఖర్చు మాత్రం కేంద్రమే పెట్టాలి అని చంద్రబాబు పట్టు పట్టడం దానికి మోడీ ప్రభుత్వం ఒప్పుకోవడం రెండూ ఎప్పుడో జరిగిపోయాయి.

  కాల యాపన కారణాలు ప్రముఖంగా రెండు:

  1. పట్టిసీమకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి చంద్రబాబు పోలవరం ప్రారంభంలోనే జాప్యం చేశారు
  2. మొదలు పెట్టీ పెట్టగానే కాంట్రాక్టర్ (పచ్చ పార్టీ వ్యక్తే సుమండీ) రేట్లపై పేచీకి దిగాడు.

  ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కనుక తన వైఫల్యాలకు మోడీ బూచి చూపిస్తున్నారు.

  ఇంకొక్క విషయం గమినించాలి, నిధులు దశలవారీగా ఇవ్వడమే పరిపాటి. సీనియర్ మోస్ట్ నాయకుడిని, నా అంత తెలివి ఇంకెవరికీ లేదు వగైరా సొంతగొప్పలు చెప్పుకొనే చంద్రబాబుకు ఇంత చిన్న విషయం తెలీదంటే ఎలా నమ్మగలము?

 8. 07/05/2018 16:10

  కేంద్రప్రభుత్వానికి వదిలేయకుండా రాష్ట్రప్రభుత్వమే నిర్మాణ బాధ్యత తీసుకోవడం మంచిదన్నదే నా పాయింట్.

 9. 07/05/2018 16:29

  బోనగిరి గారూ, నిర్మాణ బాధ్యత కేంద్రం ఎప్పుడో రాష్ట్రానికి ఇచ్చేసింది, మీరు కోరినట్టే.

 10. 07/05/2018 16:35

  అవునండి, కాని అది తప్పు అని కొంతమంది విమర్శిస్తున్నారు కదా, దానికి సమాధానం ఈ టపా.

 11. 07/05/2018 16:50

  బోనగిరి గారూ, బాధ్యత అంటూ తీసుకున్నాక జవాబుదారీ తనం అవసరం కదా. ప్రతిపక్ష విమర్శలో (“మీకు చేత కాదు లేదా చిత్తశుద్ధి లేదు, అందుకే కాలయాపన & అవినీతి, కేంద్రమే చేసి ఉండుంటే ఇంత జరిగేది కాదు”) అనేక భాగాలున్నాయి. చంద్రబాబు అనుకూల వర్గం ఇందుకే ప్రతిదాడికి దిగింది.

 12. 07/05/2018 17:26

  మీరు చాలా బాగా రాస్తారండీ

  జిలేబి

 13. 07/05/2018 23:15

  జై గారూ‌ నిధులు విడతలు గానే వస్తాయని అందరికీ తెలుసు నండీ. కాని నేను ముందే చెప్పినట్లుగా ఇల్లు కట్టుకోవటానికి నిధులు ఇస్తామని ఒక విడతగా వందరూపాయలు విదపటం సహాయంగా నిధులు మంజారు చేయటమే అవుతుందా హేళన చేయటం అవుతుందా? ఈమాత్రానికే లక్షలకోట్లు ధారపోసినట్లు బీజేపీ వాళ్ళ అల్లరి ఒకటా!

 14. 08/05/2018 10:03

  “ఒక విడతగా వందరూపాయలు విదపటం”

  2015 కేంద్ర బడ్జెట్ సమయంలో పచ్చ మీడియా “మాకు వంద కోట్లే ఇచ్చారు” అంటూ గగ్గోలు పెట్టారు నిజమే. ఇందులో నిజానిజాలు ఏమిటో ఎవరికీ తెలీదు.

  ప్రస్తుతం టీడీపీ వర్గాల ప్రకారమే జరిగిన 12,000 ఖర్చు కోట్లు కాగా కేంద్ర బకాయి 3,000 కోట్లు. మిగిలిన 8,900 కోట్లు (12,000-3,000= 9,000; 9,000-100= 8,900) ఇచ్చినప్పుడు రాధాకృష్ణ, రవి ప్రకాష్ తదితరులు ప్రజలకు చెప్పడం మర్చినట్టున్నారు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: