విషయానికి వెళ్ళండి

పార్టీ మారిన అభ్యర్థులని ఓడించండి

08/09/2018

అందరూ ఊహించనట్టే తెలంగాణా ప్రభుత్వం శాసనసభని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకి సిద్ధమయ్యింది. ఆ వెనువెంటనే అధికార TRS పార్టీ తమ అభ్యర్థులను కూడ చాలావరకు ప్రకటించింది. అలా ఖరారు చేసిన అభ్యర్థులలో సొంత పార్టీ టికెట్ పై గెలిచిన వాళ్ళతో పాటు ఇతర పార్టీలనుండి గెలిచి అధికారపార్టీలో చేరినవాళ్ళు కూడ ఉన్నారు.

2014 ఎన్నికలలో TRS సొంతంగా మెజారిటీ మార్కు దాటగలిగినా, ఇతర పార్టీల MLAలని కూడ తమ పార్టీలోకి ఆహ్వానించి కొంతమందికి మంత్రి పదవులు కూడ కట్టబెట్టింది. ఇలా పార్టీ మారిన వాళ్ళెవ్వరూ MLA పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చెయ్యలేదు. స్పీకరు కార్యాలయం కూడ వీళ్ళ అనర్హత విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, కాలయాపన చేసి పార్టీ మార్పిడులకి పరోక్షంగా సహకరించింది.

ఇదే తరహాలో ఆంద్రప్రదేశ్ లో కూడా అధికార తెలుగుదేశం పార్టీ విపక్ష MLAలని ఆకర్షించి పదవులు కట్టబెట్టింది. రాజకీయ పార్టీలు సిద్ధాంతాలతో పని లేకుండా, అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చెయ్యడం ఇప్పుడు దేశమంతా మామూలు అయిపోయింది. ఒకసారి ఎన్నికలు అయిపోయాక ఏమీ చేయలేని దుస్థితి ప్రజలది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ఇలా పార్టీలు మారే నాయకులని శిక్షించే అవకాశం ప్రజలకి వచ్చింది.

 

అందుకే నేను ప్రజలకి చేసే విజ్ఞప్తి ఏమిటంటే, ఇలా పార్టీలు మారిన అభ్యర్థులు అందరినీ మళ్లీ ఏ పార్టీ నుండి పోటీ చేసినా నిర్దాక్షిణ్యంగా ఓడించండి. వీళ్ళకు సహకరించిన స్పీకర్లని కూడ ఓడించండి. ఇక ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులు అయిన ముఖ్యమంత్రుల సంగతి ఏమిటి? వాళ్లని ఓడించే దమ్ము ప్రజలకు ఉందా? ఉంటే అంతకంటే ఇంకేం కావాలి? మరి ఈ  దుర్మార్గాన్ని చూసీ చూడనట్టు వ్యవహరించిన గవర్నర్ సంగతి ఏమిటి? ఆయనని మనం ఏమీ చేయలేము కానీ, ఈ అభ్యర్థులు అందరినీ ఓడిస్తే ముందు ముందు ఇలా జరగకుండా గవర్నర్లు జాగ్రత్త పడతారు.

ప్రజాస్వామ్యంలో విలువల గురించి నాయకులకి పట్టనప్పుడు ప్రజలే బాధ్యత తీసుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు ఓటుతో నాయకులకి బుద్ధి చెప్పాలి. “ప్రజాస్వామ్యం అంటే పశువుల సంత కాదు” అని ప్రజలే నిరూపించాలి. ఈ విషయాన్ని ప్రజాసంఘాలు, మీడియా విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్ళితే రాజకీయాలలో మంచి మార్పు వస్తుంది. నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే ఈ పోస్టుని షేర్ చెయ్యండి.

4 వ్యాఖ్యలు leave one →
 1. Anon permalink
  09/09/2018 10:08

  Yes it is a good idea to defeat the unscrupulous defectors and their saviours.

 2. నీహారిక permalink
  09/09/2018 21:54

  ఎవరెవరు ఏయే నియోజక వర్గంలో పార్టీ మారారో కూడా వ్రాస్తే ప్రజలు గుర్తుపట్టడానికి వీలుకలిగి మరింత ప్రయోజనం ఉంటుందేమో !

 3. 12/09/2018 10:04

  పార్టీలు మారని నిష్ఠాగరిష్ఠులు మచ్చుకు కూడాదొరకక అందర్నీ ఓడించవలసి వస్తుంది!
  అలాచేయాలంటే ఆ ‘నోటా’ ఓటే శరణ్యం.
  కానీ ఏం లాభం!
  వేలూ లక్షల్లో నోటాలు పడినా, అవే 99.8% ఐనాసరే, అభ్యర్థుఅందరికీ రెండంకెల సంఖ్యలుగానే ఓట్లు వచ్చి వాళ్ళల్లో ఒకటో రెండో ఓటూ అదనంగా సంపాదించుకున్న మహానుభావుడు ప్రజాప్రతినిథి ఐపోతాడు. అదీ మన చట్టం గొప్పదనం.
  చివరికి మిగతా ఎవ్వరికీ ఒక్కఓటూ రాక, ఒకడికి మాత్రం ఒకే ఒక్క ఓటు పడితే వాడే విజేత.
  ప్రజలారా, అభ్యర్థులను ఖారాఖండీగా తిరస్కరించటం అన్నది అందమైన అసాధ్యం మాత్రమే!

 4. 12/09/2018 11:10

  నా ఉద్దేశం పార్టీలు మారిన అందరినీ ఓడించమని కాదండి. అలాగైతే పట్టుమని పదిమంది కూడ మిగలరు. 2014లో ఒక పార్టీ నుండి ఎన్నికయ్యి, రాజీనామా చెయ్యకుండా అనైతికంగా పార్టీ మారి ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నవాళ్ళని ఓడించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ ఇరవయి మందిని ఓడిస్తే ఇక ముందు ఎవరూ అలా చెయ్యరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: