విషయానికి వెళ్ళండి

ద్వేషించడం అరోగ్యానికి హానికరం

01/01/2019

మిత్రులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరో సంవత్సరం మన ముందుకు యధావిధిగా వచ్చేసింది. బాలల, యువత జీవితాలలో ఈ కొత్త సంవత్సరాలు మార్పులు తెస్తాయి కాని, నడివయసు దాటిన వాళ్ళ జీవితాలలో పెద్దగా మార్పులేమీ జరగవు. అదే గానుగెద్దు జీవితం, అదే గొర్రె తోక జీతం. మరుసటి తరం కోసం మౌనంగా బతికెయ్యాలి, అంతే.

ఈ 2019 సంవత్సరం, ఎన్నికల సంవత్సరం. మన దేశంలో రాష్ట్రానికో రెండు ప్రాంతీయ పార్టీలు, దేశానికో రెండు జాతీయపార్టీలు ముఖ్యమైనవి ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు కులాల మీద, జాతీయపార్టీలు మతాలమీద అధారపడి బతుకుతున్నాయి. స్థూలంగా ఇదీ మన దేశ ప్రజాస్వామ్య దుస్థితి. గత మూడు నెలలుగా దేశంలో ఎన్నికల హడావిడి జరుగుతోంది. మరో ఆరు నెలలు ఇంకా తీవ్రంగా జరుగుతుంది. ఈ సారి మాటల యుద్ధం మరింత తీవ్రంగా ఉండపోతోంది. అన్ని పార్టీల నాయకులు, నైతిక హద్దులు అతిక్రమించి విమర్శలు చేసుకుంటారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలోనే ఇది చూసాము. లోక్‌సభ ఎన్నికలలో ఇది ఇంకెంత తీవ్రరూపం దాల్చుతుందో చూడాలి.

నాయకులు ఎంత తీవ్రంగా విమర్శల దాడులు చేసుకుంటారో, అంత కంటే తీవ్రంగా సోషల్ మీడియాలో వివిధ పార్టీలని సమర్ధించేవాళ్ళు పోస్టింగులు పెట్టి ప్రచారం చేస్తుంటారు. వీళ్ళలో చాలామంది సామాన్య ఓటర్లు, కొంతమంది కార్యకర్తలు. వీళ్ళలో కొంతమంది వాళ్ళ కులానికి సంబంధించిన నాయకుడికి మద్దతుగా, కొంతమంది వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక ప్రభుత్వ పథకం వల్ల మేలు జరిగిందని, మరి కొంతమంది తమ మతానికి ఏదో మేలు జరుగుతుందని, ఇలా రకరకాల కారణాలతో తమ నాయకుడిని ఆకాశానికి ఎత్తేస్తూ, ఇతర నాయకులని కించపరుస్తూ వ్రాస్తుంటారు. పార్టీలకి చెందిన వ్యక్తులతో సమానంగా అభిమానులు, సామాన్య పౌరులు కూడ ఇలా పోస్టింగులు పెట్టడం, షేర్ చెయ్యడం ఇప్పుడు మామూలు అయిపోయింది.

మనకు నచ్చినవాళ్ళని అభిమానించడం మంచిదే! మనకు నచ్చని వాళ్ళని విమర్శించడంలో కూడ తప్పు లేదు. కాని మనకు నచ్చని వాళ్ళని ద్వేషించడం మాత్రం సమర్థనీయం కాదు. మన కులం కాని నాయకుడిని ఎన్ని మంచి పనులు చేసినా ద్వేషించడం, అదే మన కులానికి చెందిన నాయకుడిని దేవుడిలా కీర్తించడం వల్ల లాభం ఏమీ ఉండదు. ఎవరు ఎంత ఘోరంగా ప్రచారం చేసినా మరొకరి మనసు మార్చలేరు. అలాంటప్పుడు ఈ ద్వేషభావాలు ఎందుకు?

ఇలా రాజకీయాలలోనే కాకుండా, ఇతరత్రా కులాలమీద, మతాల మీద, ప్రాంతాల మీద, వ్యక్తుల మీద అకారణ ద్వేషం ప్రదర్శించేవాళ్ళు మన సమాజంలో చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏదో ప్రయోజనం ఆశించి ఇలా చేస్తుంటారు. అది అర్థం చేసుకోకుండా సామాన్య జనులు వాళ్ళని ఫాలో అవుతూ, వాళ్ళ శత్రువులని వ్యతిరేఖిస్తుంటారు. దీని వలన వాళ్ళకి ఉపయోగం ఏమీ ఉండకపోగా, ఉద్రేకపడి వాదనలు చేస్తే అరోగ్యం పాడవుతుంది. సినిమా నటులపై, నాయకులపై అనవసరమైన అభిమానంతో ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకున్నవాళ్ళ ఉదాహరణలు మనకు ఎన్నో కనిపిస్తాయి. అంతే కాకుండా స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగుల మధ్య, బంధువుల మధ్యా విభేదాలు ఏర్పడితే మానవ సంబంధాలు దెబ్బతింటాయి.

అందుకే ఎవరినీ ద్వేషించకండి. ద్వేషించడం ఆరోగ్యానికి హానికరం. సమాజ ఆరోగ్యానికి కూడా హానికరం.

 

No comments yet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: