విషయానికి వెళ్ళండి

దశ వసంతాలు

16/02/2019

సరిగ్గా ఇవ్వాళ్టికి 10 సంవత్సరాల క్రితం నా బ్లాగులో మొట్టమొదటి టపా ప్రచురించాను. అంటే నా బ్లాగు నేటికి దశ వసంతాలు పూర్తిచేసుకుంది. నిజానికి అంతకు కొన్ని నెలల ముందే బ్లాగు రిజిష్టర్ చేసాను. కాని బ్లాగుకి ఏ పేరు పెట్టాలా, ఏమి వ్రాయాలా అని ఆలోచించడంలోనే కొంత కాలం గడిచిపోయింది. నా ఆలోచనలని బ్లాగు ద్వారా ప్రపంచంతో పంచుకోవాలని నా ఉద్దేశం. “ఆలోచనా తరంగాలు” అనే బ్లాగు అప్పటికే ఉండడంతో నా బ్లాగుకి “ఆలోచనాస్త్రాలు” అని పేరు పెట్టుకున్నాను. 

నేను అంతకు ముందు తెలుగు పీపుల్.కాంలో కొన్ని వ్యాసాలు వ్రాసాను. అప్పటికి నాకు బ్లాగు అనేది ఒకటి ఉందని, తెలుగులో కూడ బ్లాగులు ఉన్నాయని తెలియదు. ఒకసారి నా మిత్రుడు ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు, అతని బంధువు కలిసాడు. ఆయన అమెరికా నుంచి వచ్చాడు. తాను తెలుగులో బ్లాగు వ్రాస్తున్నానని, చాలామంది NRI లు కూడ వ్రాస్తున్నారని చెప్పడంతో ఆ బ్లాగు “రేగొడియాలు” చదివి, నేను కూడ బ్లాగు మొదలుపెట్టాను. ఆ తరువాత ఆయన ఎందుకో వ్రాయడం మానేసారు. 

నాకు ఊహ తెలిసినప్పటినుంచి, నా ఆలోచనలు కొన్నిటిని ఏదైనా పాత డైరీలో వ్రాసుకోవటం నాకు అలవాటు. బ్లాగు మొదలుపెట్టాకా, మొదటి టపా ఏమి వ్రాయాలా అని అలోచిస్తే నా డైరీలో ఎప్పుడో వ్రాసుకున్న కొన్ని వాక్యాలు గుర్తొచ్చి, వాటినే ఒక చిన్న వ్యాసంలా చేసి “ఆరంభం” అన్న శీర్షికతో పోస్టు చేసాను. ఆ పోస్టుని పెద్దగా ఎవరూ చదవలేదు కాని, తరువాత వ్రాసిన “తిరుమల” పోస్టుని చాలామంది చదివి కామెంట్ పెట్టారు. 

ఇక అప్పటి నుంచి తరచు టపాలు వ్రాయడం, ఇతరుల టపాలు చదివి కామెంట్లు వ్రాయడం నా హాబి అయిపోయింది. అప్పట్లో చాలామంది బ్లాగర్లు ఎంతో ఉత్సాహంగా టపాలు, కామెంట్లు వ్రాసేవారు. రాను రాను చాలామంది బ్లాగులు విడిచి ఇతర సోషల్ మీడియాలలోకి వెళ్ళిపోయారు. అయినా నా ఉద్దేశంలో ఫేస్‌బుక్, వాట్సప్‌లలో వ్రాసేది క్షణికం. కాని బ్లాగుల్లో వ్రాసేది చాలా కాలం ఉంటుంది. 

ఈ పదేళ్ళ బ్లాగు జీవితంలో నేను వ్రాసింది కేవలం 100కు పైగా టపాలు మాత్రమే. అంటే సగటున నెలకి ఒక్కటికంటే తక్కువే! ఇంకా ఎన్నో సార్లు వ్రాయాలనుకున్నా, సమయం, సందర్భం సరిగా కుదరక, పని ఒత్తిడి వల్లా వ్రాయలేదు. కొంత బద్ధకం అని కూడ ఒప్పుకోక తప్పదు. అలా వీలు కానప్పుడు కామెంట్ల రూపంలో నా అభిప్రాయం వ్రాస్తూనే ఉన్నాను.

ఈ పదేళ్ళలో ఎంతో మంది బ్లాగర్లు మంచి మిత్రులయ్యారు. కొద్దిమంది నా అభిప్రాయాలతో వ్యతిరేఖించినా, శత్రువులు ఎవ్వరూ అవ్వలేదు. అతిగా వాదించేవాళ్ళకి కాస్త దూరంగా ఉండడంవల్ల నాకు పెద్దగా చేదు అనుభవాలు ఎదురవ్వలేదు. అయితే అన్ని రకాల వ్రాతలు చదవడం వల్ల ఎవరు ఎలా ఆలోచిస్తారో అన్న విషయం అర్థమయ్యింది. నా ఆలోచనా పరిధి విస్తృతమయింది. నా బ్లాగు వ్యాసంగంలో తోడ్పడిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలంటే చాలా మంది గురించి చెప్పాలి కాబట్టి, బ్లాగ్ మిత్రులు అందరికీ సింపుల్‌గా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. వీలైనంతవరకు బ్లాగులో వ్రాస్తూనే ఉంటాను.

10 వ్యాఖ్యలు leave one →
 1. 16/02/2019 19:32

  మీ పదవ బ్లాగ్-బర్త్ డే శుభాకాంక్షలు.

 2. 17/02/2019 05:13

  బ్లాగ్ పుట్టిన రోజు శుభకామనలు. అభినందనలు.

 3. 19/02/2019 15:10

  YVR గారు, శర్మ గారు, మీ శుభాకాంక్షలకి ధన్యవాదాలు

 4. Niharika permalink
  19/02/2019 17:34

  Happy Blogging !

 5. 19/02/2019 17:46

  Thank you, Niharika ji.

 6. 25/02/2019 14:40

  బోనగిరిగారు
  వందనాలు.

  మీరు ప్రేమతో ముందుమాట రాసిన నా e.Book కినిగెలో లైవ్ చేయబడింది. లింక్ లో చూడగలరు.
  http://kinige.com/kbook.php?id=9310
  ధన్యవాదాలతో

 7. 25/02/2019 16:53

  నాకు ముందుమాట వ్రాసే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు, శర్మ గారు.

 8. 01/03/2019 16:10

  బోనగిరిగారు,

  మీరు ముందుమాట రాసిన నా ఇ.బుక్ ఈ వారం కూడా మొదటి పదిలో ఉన్నట్టు కినిగె వారి వార్త.
  ధన్యవాదాలతో

 9. 08/03/2019 08:23

  మిత్రులు బోనగిరిగారు,
  వందనాలు.

  మీరు ముందుమాట రాసిన నా ఇ.బుక్ రెండవవారం కూడా మొదటి పదిలోనూ ఉన్నట్టు కినిగెవారి వార్త

  Your book శర్మ కాలక్షేపం కబుర్లు – నాకు నచ్చిన పెళ్ళి (Sarma Kalakshepam Kaburlu Naaku Nachchina Pelli) is in weekly top ten list of Kinige

  ధన్యవాదాలతో

 10. 08/03/2019 09:58

  సంతోషం, శర్మ గారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: