విషయానికి వెళ్ళండి

మనిషి ఓటమి

10/04/2020

ఒక్కసారి ఆలోచించండి…

మన చుట్టూ ఉన్న కోతో, కుక్కో, ఆవో, మేకో,
అడవిలో ఉన్న సింహమో, ఏనుగో,
మనిషిని ఇలా సవాల్ చేస్తే?

ఓ మనిషీ, ఇన్నాళ్ళూ నువ్వు ఈ ప్రపంచాన్ని పాలించావు.
కాని నువ్వు ఘోరంగా విఫలమయ్యావు.
ఇక నీ సారధ్యం మాకు అక్కర్లేదు.

నీకు ఎంతో మేధస్సు ఉంది,
కాని ఈ ప్రపంచాన్ని నడిపించడం నీవల్ల కాలేదు.
నీ మేధస్సునంతా సాటి జీవరాశిని ఓడించడానికే ఉపయోగించావు.
నీ అతి తెలివితో ప్రకృతిని నానా రకాలుగా హింసించావు.
ఇప్పుడు నీ మనుగడకే పెను ప్రమాదం తెచ్చిపెట్టుకున్నావు.

మమ్మల్ని బోనులో నిలబెట్టి వినోదించిన నువ్వే,
ఇప్పుడు బోనులో ఇరుక్కున్నావు.
మరి కొన్ని రోజుల్లో కరోనా కనపడకపోవచ్చు,
కాని రేపు మరో మరోనా వస్తే అప్పుడేం చేస్తావు?
ఎప్పటికప్పుడు ఔషధాలు వెతుక్కోవడం తప్ప,
భూమిని నాశనం చేసే ఆయుధాలు వదిలెయ్యాలన్న జ్ఞానం నీకు లేదు.
ఎప్పటికైనా నీది విధ్వంస మార్గమే!

రెండు ప్రపంచయుద్ధాలు,
లెక్కలేనన్ని అణ్వస్త్రాలు,
పర్యావరణకాలుష్యం,
వరల్డ్ మేప్ నిండా టెర్రరిజం.
ఇవీ నువ్వు సాధించిన విజయాలు.

అందుకే మాకు నీ నాయకత్వం అక్కర్లేదు.
వదిలేయ్, పగ్గాలు వదిలేయ్!
అన్నీ ఉన్న నీ కన్నా,
నోరు లేని మేమే నయం.
ఇక నుండీ మేమే ప్రపంచాన్ని నడిపిస్తాం!
మా వెనుక నడు, నీకు సరైన దారి చూపిస్తాం!

2 వ్యాఖ్యలు leave one →
 1. GKK permalink
  11/04/2020 00:16

  100% true. Excellent poem bonagiri Garu.
  Man has lost the moral right. For thousands of years animals and other species tolerated the cruelty of humans.

  Now the animals asserting their rightful place. The planet belongs to them too.

 2. 11/04/2020 08:34

  Thanks GKK గారు.
  ఇది నాలుగు రోజుల క్రితం ఈనాడు కోసం వ్రాసి పంపాను. వాళ్ళు వెయ్యలేదు. కొంచెం ఇంప్రూవ్ చేసి ఇక్కడ పెట్టాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: